ఎవ‌రైనా ఆత్మ‌హ‌త్య చేసుకోవాలనుకుంటే ఆయ‌న‌కు చెబితే చాలు..

ప్ర‌పంచంలో మ‌నుషులు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటారు. ఇందులో ఇప్పుడు తెలుసుకోబోయే వాడు మ‌రీ ప్ర‌త్యేకం. ఎవ్వ‌రైనా ఎలా బ్ర‌త‌కాలో చెప్పేందుకు మోటివేష‌న్ క్లాసులు తీసుకుంటారు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం చ‌నిపోవాల‌ని ఎవ్వ‌రైనా అనుకుంటే చాలు వెంట‌నే అక్క‌డి వాళ్ల‌ను లైన్‌లోకి తీసుకొని హ్యాపీగా చంపేస్తాడు.

విచిత్రంగా ఉన్నా ఇది నిజం. సామాజిక మాధ్యమాల్లో ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ పోస్ట్‌ చేసిన యువతులతో ట్విటర్‌లో పరిచయం పెంచుకునేవాడు. వారి ఆత్మహత్యకు సాయం చేస్తానని, తన అపార్ట్‌మెంటుకు రమ్మని పిలిచేవాడు. అలా వచ్చిన వారిని అత్యాచారం చేసి హత్య చేసేవాడు. ఈక్రమంలో అడ్డుకోబోయిన ఒక యువతి ప్రియుడిని కూడా అంతమొందించాడు. ఇలా మొత్తం 9మందిని చంపి, ముక్కలుగా చేసి తన ఇంట్లో కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరిచాడు. ట్విటర్‌ ద్వారా మృతులను ఆకర్షించడంతో అతడికి ట్విటర్‌ కిల్లర్‌ అన్న పేరు వచ్చింది.

ఈ వ్య‌క్తి పేరు టకాహిరో షిరైషీ(30). ఇత‌ని దారుణాలు తెలిసిన వారంతా షాక్‌కు గుర‌య్యారు. ఎలాగైనా శిక్ష విధించాల‌ని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు 2017లో పోలీసులు షిరైషీని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం షిరైషీకి మరణశిక్ష విధిస్తున్నట్లు టోక్యో కోర్టు తీర్పునిచ్చింది. జపాన్‌లో మొత్తం 9మందిని దారుణంగా హత్య చేసి, ముక్కలుగా నరికాడ‌ని ఈయ‌న గురించి చెబుతారు. ఇలాంటి వ్య‌క్తికి స‌రైన శిక్ష ప‌డింద‌ని ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here