ప్ర‌తి రోజూ క‌రోనా వ్యాక్సిన్ వీరికి మాత్ర‌మే..

క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచం ఎదురుచూస్తోంది. ఇక భార‌త్‌లో కూడా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. కాగా దీనికి సంబంధించిన ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా త్వరలోనే మన దేశానికి కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందని ఇటీవలే ప్రధాని మోదీ కూడా చెప్పారు. దీంతో ప్రజలంతా వేయి కళ్లతో వ్యాక్సిన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలకు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ తాజాగా శుభవార్త చెప్పారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన వీకే పాల్.. ఇప్పటికే 6 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు వెల్లడించారు. తాజాగా మరో వ్యాక్సిన్‌కు కూడా క్లినికల్ ట్రయల్స్ కోసం క్లియరెన్స్ ఇవ్వబోతున్న విషయాన్ని చెప్పారు. ఈ ట్రయల్స్ పూర్తయిన తర్వాత వీటిలో కొన్నింటికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతులు లభిస్తాయి. ఇదే జరిగితే ఇక వ్యాక్సిన్ పంపిణీయే తరువాయి. దీనికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు కూడా తాము చేస్తున్నామని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ వెల్లడించారు. వ్యాక్సిన్ నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి 29వేల కోల్డ్ చైన్ పాయింట్స్, 240 వాక్-ఇన్ కూలర్స్, 70 వాక్-ఇన్ ఫ్రీజర్స్, 45000 ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్స్, 41,000 డీప్ ఫ్రీజర్స్, 300 సోలార్ రిఫ్రిజిరేటర్స్‌ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు రెడీ అయిన భారతీయులకు కేంద్ర కుటుంబ సంక్షఏమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే షాకింగ్ విషయం చెప్పారు. వ్యాక్సిన్ రాగానే అందరికీ టీకాలు వేయడం జరగదని ఆయన స్పష్టం చేశారు. తొలుత ప్రతి రోజూ ఒక్కో వ్యాక్సిన్ బూత్‌లో 100 మందికి మాత్రమే టీకా వేస్తారట. ఇలా రోజుకు 100 మంది చొప్పున అందరికీ వ్యాక్సిన్ వేస్తామని అశ్విని కుమార్ చెప్పారు. బిహార్ రాజధాని పట్నాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో వ్యాక్సిన్ రాగానే అందరికీ ఇచ్చేస్తారని ఆశలు పెట్టుకున్న చాలా మంది నిరుత్సాహ పడ్డారు. అయితే వ్యాక్సిన్ అందరికీ అందుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి భయాలూ అక్కర్లేదని అశ్విని కుమార్ నొక్కిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here