అమెరికా అధ్య‌క్షుడి వ‌య‌స్సు 78 సంవ‌త్స‌రాలు.. అందుకే క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా..

క‌రోనా వ్యాక్సిన్ ప‌లు దేశాల్లో పంపిణీ అవుతోంది. దీంతో అంద‌రూ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకుంటామా అన్న ఆలోచ‌న‌లో ఉన్నారు. కాగా సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు అంద‌రూ క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వ‌రుస‌లో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు.

అమెరికాలో క‌రోనా ఏ ర‌కంగా విజృంభించిందో మ‌న‌కు తెలిసిందే. 3 ల‌క్ష‌ల‌కు మందికి పైగా ప్ర‌జ‌లు క‌రోనాతో అక్క‌డ చ‌నిపోయారు. ఇక జో బైడెన్ ఇటీవ‌లె అమెరికా అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. జో బైడెన్ వ‌య‌స్సు 78 సంవ‌త్స‌రాలు. దీంతో వ‌య‌స్సు ఎక్కువగా ఉన్న కార‌ణంగా ఆయ‌న కూడా క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన లిస్టులో ఉన్నార‌ని చెప్పొచ్చు. ఈ మేరకు అమెరికాలో ఇన్ఫెక్షియస్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఫాసీ తనకు సలహా ఇచ్చినట్లు బైడెన్ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఆయన వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని ఫాసీ చెప్పారట. 78 ఏళ్ల బైడెన్ ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. వ్యాక్సిన్‌ను అగ్రరాజ్యం అనుమతి లభించిన నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన.. తాను కూడా త్వరలోనే టీకా తీసుకోబోతున్నానని, ఇది పబ్లిక్‌గానే చేస్తానని ప్రకటించారు.

బ్రిటన్‌లో ఆమోదం పొందిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌కు అమెరికాలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. సోమవారం నుంచి అమెరికాలో వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ వ్యాక్సీన్ తయారు చేశాయి. కానీ ఈ వ్యాక్సిన్ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ పలు దేశాలు ఆరోపణలు చేశాయి. వాటిలో అమెరికా కూడా ఒకటి. కరోనాతో అల్లాడుతున్న అగ్రరాజ్యంలో కొందరు పరిశోధకులు ఫైజర్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయంటూ వెల్లడించారు. కొందరిలో ముఖ పక్షవాతం కూడా వచ్చిందని ఆరోపించారు. దీంతో ఈ వ్యాక్సిన్‌కు అగ్రరాజ్యం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ అవరోధాలన్నింటినీ ఛేదించిన ఫైజర్ టీకాకు అగ్రరాజ్య ఆమోదం లభించింది. దీంతో తొలి వ్యాక్సిన్‌ను న్యూయార్క్‌లో ఓ ఆస్పత్రిలో పనిచేసే నర్సుకు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here