పూజా హెగ్డే బంపర్ ఆఫ‌ర్‌..?

హీరోయిన్లు అవ‌కాశాలు వ‌స్తే వెంట‌నే స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ మెగాస్టార్‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ట‌. మెగాస్టార్ ఆచార్య సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా లాక్‌డౌన్ అనంత‌రం సినిమా షూటింగ్ రెగ్యుల‌ర్‌గా సాగుతోంది.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇందుకోసం చాలా మంది హీరోయిన్ల‌ను ప‌రిశీలించారు. బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా పేర్లు వినిపించాయి. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఫైన‌ల్‌గా పూజా హెగ్డేని ఫిక్స్ చేశార‌ని టాక్‌. పూజాను చిత్రబృందం తాజాగా సంప్రదించిందని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తాజా సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here