జ‌న‌వ‌రిలో సింగ‌ర్ సునీత పెళ్లి..

ప్ర‌ముఖ గాయ‌ని సునీత పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డింది. ఆమె తాజాగా పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త‌లు ఎక్కువ అయ్యాయి. అయితే అంత‌లోనే పెళ్లి ఇప్పుడు కాదు అంటూ మళ్లీ పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే మొత్తానికి సునీత పెళ్లి డేట్ ఫిక్స్ అయింది.

ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సునీత పెళ్లి జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ వివాహానికి జనవరి 9వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్‌ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్‌, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్‌ యూనిట్‌కి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ రోజు సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. సునీత పెళ్లి వార్త తెలియ‌గానే ఆమె స‌న్నిహితులు సంతోషం వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here