ప‌వ‌న్ చెబితేనే అలా చేశాన‌ని అంటున్న క్రిష్‌.. ఇంత‌కీ ఏం జ‌రిగిందో తెలుసా..

ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేసే ద‌ర్శ‌కుడు ఆయ‌న కంటే ముందు మ‌రో సినిమా తీశాడు. దీంతో ప‌వ‌న్‌తో సినిమా కాకుండా వేరే మూవీ ఎందుకు చేశార‌న్న అనుమానాలు అంద‌రిలోనూ క‌లిగాయి.

ఆయ‌నెవ‌రో కాదు ద‌ర్శ‌కుడు క్రిష్‌. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ హీరో హీరోయిన్లుగా అతి తక్కువ సమయంలో డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను పూర్తి చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం 45 రోజుల్లోనే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో రకుల్ డీ-గ్లామర్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో క్రిష్ చెప్పాడు. కొండ‌పాలం అనే పుస్త‌కం క్రిష్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింద‌ని చెప్పారు. దీంతో వెంట‌నే ఆయ‌న పార్ట్‌న‌ర్‌కు చెప్పి దాని హ‌క్కులు తీసుకోమ‌ని చెప్పారంట‌. రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నట్లు అయితే తన సినిమా కంటే ముందు మరో సినిమా చేసుకొమ్మని పవర్ స్టార్ చెప్పార‌ట‌. దీంతో వెంటనే వైష్ణ‌వ్ తేజ్‌తో సినిమా చేసిన‌ట్లు చెప్పారు. అయితే ఈ సినిమాలో ర‌కుల్ రాయ‌ల‌సీమ‌కు సంబంధించిన పాత్ర‌లో క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here