అమెరికా చైనా గురించి ముఖ్య‌మైన స‌మాచారం అందరూ తెలుసుకోవాల్సిందే..

ప్ర‌పంచంలో జ‌నాభాలో పెద్ద దేశాలంటే ముందుగా చైనా, భార‌త్ గురించే అంద‌రూ మాట్లాడుకుంటారు. అయితే ఆర్థికంగా అగ్ర‌దేశాలంటే అమెరికా త‌ర్వాత చైనా గురించి అంతా చెబుతారు. అయితే ఈ రెండింటిలో పోటీ మామూలుగా ఉండ‌దు. ఇక రెండు దేశాల మ‌ధ్య శ‌త్రుత్వం కూడా బాగానే ఉంటుంది.

అమెరికా, చైనా దేశాల్లో ఏది గొప్ప అంటే అమెరికా పేరు చెబుతారు. అయితే ఇప్పుడు చైనా అమెరికాను క్రాస్ చేసేందుకు సిద్ద‌మ‌వుతోంది. 2033 సంవత్సరంలో చైనా టాప్‌లోకి వస్తుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా..! అయితే.. కరోనా పుణ్యమా అని అంతకంటే మునుపే ఈ దృశ్యం సాక్షాత్కారం కానుంది. చైనాలోనే పుట్టిన కరోనాను అందరికంటే ముందే అదుపులోకి తెచ్చామని చెప్పుకుంటున్న చైనా..ప్రస్తుతం మరింత కసి, పట్టుదలతో ఆర్థిక రంగాన్నీ పరిగెత్తిస్తోంది. కరోనా ప్రతికూల ప్రభావం నుంచి అమెరికా కంటే వేగంగా కోలుకుంటోంది. ఇదే స్పీడు కొనసాగితే..ఇది వరకటి అంచనా కంటే ఏకంగా ఐదేళ్లు ముందే అమెరికాను అధికమించి ప్రపంచ నెం.1 ఆర్థిక శక్తిగా చైనా అవతరిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. సెంటర్ ఫర్ ఎకానామిక్స్ ఎండ్ బిజినస్ రీసెర్చ్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

‘కరోనా సంక్షోభం తరువాతి పరిస్థితులు చైనాకు లాభించాయి. అమెరికాతో రేసులో చైనా దూసుకుపోతోంది’ అని ఈ అధ్యయనం పేర్కొంది. చైనాలో ముందుగా లాక్ డౌన్లు విధించడం, సంక్షోభ సమయంలో నేర్పుగా వ్యవహరించడం మూలాన పాశ్చాత్య దేశాలు దీర్ఘ కాలిక అభివృద్ధి అంచనాల్లో చైనా కంటే వెనుకబడ్డాయి అని ఈ స్టడీలో తేలింది. దీని ప్రకారం..2021-25 మధ్య చైనా ఆర్థిక వ్యవస్థ 5.7% వేగంతో, 2026-30మధ్య 4.5% వేగంతో దూసుకుపోనుంది. అదే సమయంలో కరోనా కారణంగా అమెరికా ఆర్థికాభివృద్ధి వేగం 1.6%-1.9% పరిమితమవ్వనుంది. దీంతో..చైనా 2028 కల్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అధ్యయనకారులు అంచనా వేశారు. ఇక జపాన్ మాత్రం మునుపటి లాగానే మూడో స్థానంలో కొనసాగుతుందని వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here