ఈ నెల 28 నుంచి కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండండి..

దక్షిణ సముద్రతీర జిల్లాల్లో ఈ నెల 28వ తేది నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పొడి వాతావరణం, చలి నెలకొనివుంది. దక్షిణ సముద్రతీర జిల్లాల్లో 28 నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. చెన్నైలో రాత్రి వేళలో చలి, పగటిపూట పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో చ‌లి గాలుల‌కే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనికి తోడుగా క‌రోనా స్ట్రెయిన్ వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ప‌రిస్థితుల్లో వ‌ర్షాలు కుర‌వ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాలపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. దేశంలో ఏ ప్రాంతంలో వ‌ర్షం కురిసినా దాని ప్ర‌భావం మిగ‌తా ప్రాంతాల‌పైన ఉంటుంది. భ‌యంక‌ర‌మైన వ్యాధులు ఏ ప్రాంతంలో ఉన్నా అక్క‌డి ప్ర‌జ‌లు ఇక్క‌డ‌కు రావ‌డం వ‌ల్ల వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ఇప్పుడు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల‌కు మించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

కాగా క‌రోనా స్ట్రెయిన్ ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌కు పాకిపోయిందని తెలుస్తోంది. ఇండియాలో యూకే నుంచి వ‌చ్చిన వారికి ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక ఫ్రాన్స్ పౌరునికి కరోనా టెస్టులు నిర్వహించాగా, అతను కరోనా కొత్త స్ట్రెయిన్ బారినపడ్డాడని తేలింది. అయితే ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. బాధితుడు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here