షాకింగ్ న్యూస్‌.. వాయు కాలుష్యంతో ల‌క్ష మంది మృతి..

వాతావ‌ర‌ణంలో కాలుష్యం ఎక్కువైపోతుంది. పెద్ద పెద్ద న‌గ‌రాల్లో కాలుష్యం పెరిగిపోతుంద‌ని ఇప్ప‌టికే మ‌న‌కు తెలుసు. అయితే ఇది మ‌నుషుల ప్రాణాలు తీసే వ‌ర‌కు దారితీస్తోంది. ఇటీవ‌ల వెలుగు చూస్తున్న ప‌లు విష‌యాలు అంద‌రినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

వాయు కాలుష్యం కారణంగా ఎంతమంది మృతి చెందుతున్నారో తెలిస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. మెడికల్ రీసెర్చ్ జనరల్ లెన్సెట్‌లో ప్రచురితమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్(ఐసీఎంఆర్) రిపోర్టులో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగు చూశాయి. వాయు కాలుష్యం కారణంగా 2019లో మధ్యప్రదేశ్ లో ఒక లక్షా 12 వేల మంది అకాలమరణం పాలయ్యారు. వీరిలో 54,101 మంది ఇంట్లో నెలకొన్న వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బయటి వాయు కాలుష్యం కారణంగా 53,201 మంది మృతి చెందారు.

ఐసీఎంఆర్ రిపోర్టును అనుసరించి మధ్యప్రదేశ్‌లో ఓజోన్ గ్యాస్ కారణంగా 10,832 మంది మృతి చెందారు. ఈ రిపోర్టులో వాయు కాలుష్యం కారణంగా రాష్ట్రంలోని ఆర్థికవ్యవస్థ, ప్రజల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడిందో వెల్లడించారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఖర్చుచేస్తున్న వ్యయం జీడీపీపై ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా మధ్యప్రదేశ్‌లో 1,449 కోట్ల రూపాయల మేరకు నష్టం వాలిల్లింది. ఇంటిలోని వాయు కాలుష్యం బయటి కాలుష్యం కన్నా ప్రమాదకరంగా పరిణమించింది. పూరి పాకలు, మురికివాడలు, వెంటిలేషన్ లేని ఇళ్లలో నివసిస్తున్నవారు వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. మరోవైపు ఈ నాటికీ కొన్నిప్రాంతాల్లో కట్టెపొయ్యిలు, పిడకలు, కుంపట్లను వినియోగించి వంట చేస్తున్న కారణంగా ఇళ్లలో వాయు కాలుష్యం అలముకుంటోది. ఈ కారణంగానూ పలువురు అస్వస్థతకు లోనవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here