ఆడ బొమ్మ‌ని పెళ్లి చేసుకున్నాడు.. కార‌ణం ఏంటో తెలుసా..

పెళ్లి అంటే ఓ అబ్బాయి, అమ్మాయి క‌లిసి చేసుకుంటారని మ‌న‌కు తెలుసు. అయితే కొంద‌రు విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటారు. ఇక్క‌డ మ‌నం చెప్పుకోబోయే ఈ వ్య‌క్తి ఓ బొమ్మ‌ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ వార్త బాగా వైర‌ల్ అవుతోంది. కజకిస్థాన్ దేశానికి చెందిన బాడీబిల్డర్ యూరి టోలోచ్కో ఓ బొమ్మను పెళ్లి చేసుకున్నాడు.

బాడీబిల్డరు యూరీ వివాహం బొమ్మతో ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉండగా, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యంగా జరిగింది. కేవలం 12 మంది అతిథులతో నైట్ క్లబ్ లో యూరి బొమ్మను వివాహమాడారు. తాను వివాహమాడిన బొమ్మ క్రిస్మస్ పండుగకు ముందు విరిగిపోయిందని, దీంతో దీన్ని మరమ్మతులు చేయించేందుకు తన బొమ్మ భార్యను వేరే నగరానికి పంపించానని బాడీ బిల్డరు యూరి చెప్పారు. తన బొమ్మ భార్య కోలుకున్నాక తనతో గడుపుతానని చెపుతూ యూరీ బొమ్మతోతన పెళ్లి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. తన బొమ్మ భార్య లేని సెలవురోజుల్లో తన స్నేహితులతో గడుపుతానని యూరి వివరించారు. మ‌నుషుల‌తో కాకుండా ఇలా బొమ్మ‌తో వివాహం చేసుకోవ‌డం ఎందుక‌న్న కార‌ణం మాత్రం ఇంకా తెలియ‌లేదు. మొత్తానికి ఈ విష‌యం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here