‘#BRO’ నుంచి ‘నీ చూపులో ఉంది ఏదో వల.. నీ వైపు లాగింది నన్నే అలా’.. లిరికల్ సాంగ్ విడుదల..

నవీన్ చంద్ర, అవికా గోర్ జంటగా కార్తిక్ తుపురాని తెరకెక్కిస్తున్న సినిమా #BRO. మాంగో మాస్ మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే సినిమా మొదటి లిరికల్ సాంగ్ ఓ మైడ్ డియర్ బ్రదర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఆనందం ఆనందం అంటూ సాగే ఈ పాటను సీనియర్ లిరిక్ రైటర్ భాస్కరభట్ల రాసారు. శేఖర్ చంద్ర సంగీతం స్వరపరిచిన ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న #BRO సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటర్. సచిన్ కుందాల్కర్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.

నటీనటులు:
నవీన్ చంద్ర, అవికా గోర్ తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తిక్ తుపురాని
నిర్మాత: మాంగో మాస్ మీడియా
బ్యానర్: మాంగో మాస్ మీడియా
సంగీతం: శేఖర్ చంద్ర
లిరిసిస్ట్: భాస్కర భట్ల
సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్
ఎడిటర్: విప్లవ్ నైషధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here