స‌మంత‌కు గోవా అంటే ఎందుకు ఇష్టం..

ప్ర‌ముఖ హీరో నాగ‌చైత‌న్య‌, స‌మంత దంప‌తులు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉంటారు. ఎందుకంటే అగ్ర ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన చైత‌న్య అదే స్థాయిలో టాప్ హీరోయిన్ అయిన స‌మంత‌ను పెళ్లాడటంతో జంట సూప‌ర్‌గా ఉంద‌ని అంద‌రూ అన్నారు. అయితే ఇప్పుడు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం చైతూ స‌మంత ఇద్ద‌రూ క‌లిసి గోవా వెళ్లారు.

అయితే ఇక్క‌డే అంద‌రూ ఆలోచిస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి గోవానే ఎందుకు ఎంచుకున్నార‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉంది. అయితే ఇక్క‌డే మ‌నం ఒక విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. దీంతో వీరికి గోవా అనేది ఎంతో స్పెష‌ల్ అనుకోవ‌చ్చు. అందుకే 2021 సెల‌బ్రేష‌న్స్ కూడా అక్క‌డే జ‌రుపుకోవాల‌ని అనుకొని ఉండొచ్చు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం గోవా బయల్దేరారు. విమానాశ్రయంలో ఉన్న చైతన్య, సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో వీరు న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here