సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌క‌ముందే కుదిరిన డీల్‌..

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా 2019లో బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎఫ్‌.2. ఈ సినిమా భారీ స‌క్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు ఎఫ్ 3 సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లె త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ‘ఎఫ్‌ 3’ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ‘నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం’ అని వెంకీ వాయిస్‌లో… ‘నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా’ అని వరుణ్‌తేజ్‌ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు ఎఫ్‌2 పాపులర్‌ అయిన ‘అంతేగా ..అంతేగా..’ అనే డైలాగ్‌తో ఉన్న కాన్సెప్ట్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే డిజిటిల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడైపోయాయట. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమేజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందట. అలాగే శాటిలైట్ హక్కుల కోసం ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ భారీ ధర చెల్లించిందట. ఈ నెల 23 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here