బాల‌కృష్ణ కొత్త మూవీ గురించి రూమ‌ర్స్ నిజ‌మేనా..

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బాల‌య్య సినిమా వ‌స్తుందంటే చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆయ‌న డ్యాన్స్‌తో పాటు భారీ డైలాగ్‌లు, ఫైటింగ్‌లు అభిమానులు చాలా ఇష్ట‌ప‌డ‌తారు. తాజాగా ఆయ‌న న‌టించ‌బోయే చిత్రంపై ప‌లు రూమ‌ర్స్ వస్తున్నాయి.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీని తర్వాత బాలకృష్ణ న‌టించ‌బోయే సినిమాల గురించి క్లారిటీ లేదు. పలువురి దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమా రూపొందనుందట. గోపీచంద్‌ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణకు కథను నెరేట్‌ చేశారని, ఆయన కూడా ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఇటు దర్శకుడు గోపీచంద్‌ మలినేని, అటు నందమూరి క్యాంప్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. గోపీచంద్‌ మలినేని ప్రస్తుతం రవితేజతో క్రాక్‌ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here