ఆర్ఆర్ఆర్ టీజ‌ర్ రికార్డ్‌..

స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీస్తున్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్‌లు యూట్యూబ్‌లో అపూర్వ ఆదరణను దక్కించుకున్నాయి. దసరా సందర్భంగా విడుదలైన `రామరాజు ఫర్ భీమ్` వీడియో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ వీడియో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటికి 5 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు దక్కించుకున్న టీజర్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు లేదు. అలాగే ఈ వీడియో ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 12 లక్షల లైక్‌లు ఈ వీడియోకు వ‌చ్చాయి. ఇక, రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా మార్చిలో విడుదలైన `భీమ్ ఫర్ రామరాజు` వీడియో కూడా యూట్యూబ్‌లో దుమ్మురేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here