“మంచి రోజులు వచ్చాయి” మూవీ రివ్యూ

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకంపై సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా“మంచి రోజులు వచ్చాయి”. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, UV క్రియేషన్స్, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మారుతి మార్క్ కామెడీకి ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారో చూద్దాం పదండి.

నటీనటుల పనితీరు:

హీరో, హీరోయిన్ సంతోష్, మెహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ… ప్రేమలో వుండే క్యూట్ జంటగా మెప్పించారు. సంతోష్ తన పాత్రకు తగ్గట్లు.. కామెడీ సన్నివేశాల్లో బాగా ఆకట్టు కున్నాడు. హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. కీలక పాత్రలో నటించిన అజయ్ ఘోష్ చాలా బాగా నటించాడు. స్టార్ కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి పాత్రలను కూడా నిడివి తక్కువే అయినా… నవ్వించే ప్రయత్నం చేశారు.

కథ:

సంతోష్(సంతోష్ శోభన్), పద్మ(మెహ్రీన్)…ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. గోపాలం తిరుమలశెట్టి (అజయ్ ఘోష్) మహా భయస్తుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ పెద్దగా ఊహించుకుని ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న హీరో, హీరోయిన్ లు వీరిద్దరూ ప్రేమించుకొంటారు. తర్వాత పెళ్ళి చేసుకోవాలను కుంటారు.అయితే ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకించే పద్మ తండ్రి గోపాలం (అజయ్ ఘోష్). సంతోష్ ప్రేమలో ఉందని తెలుసుకొని అతన్ని పెళ్లి చేసుకుంటే..తన కూతురు జీవితం నాశనం అవుతుందని ఇంటి కొచ్చిన కూతురిని అనుమానిస్తూ తన కూతురుకి వివిధ రకాల పెళ్లి సంబంధాలను చూస్తూ…చాలా ఆందోళన కరమైన జీవితాన్ని గడుపుతూ..తన చుట్టూ వున్న కొంతమంది వ్యక్తులు చెప్పుడు మాటలు విని భయాందోళనకు గురవుతూ ఉంటాడు.మరి ఆందోళన కరమైన జీవితం గడుపుతున్న తన తండ్రిని పెళ్లికి ఒప్పించిందా? కన్ఫ్యూజన్ లో వుండే పద్మ తండ్రి గోపాలంను సంతోష్ మార్చ గలిగాడా? చివరికి వీరిద్దరి పెళ్లికి గోపాలం అంగీకరించాడా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సాంకేతిక :

“మంచి రోజులు వచ్చాయి” సినిమాను మారుతి గారు తన స్టైల్ లో ఫుల్ ఎంటర్టైనర్ కామెడీ జోనర్లో అద్బుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉంది. సెకండ్ ఆఫ్ చాలా ఇంట్రెస్ట్ గా సాగెలా దర్శకుడు మారుతి ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో సక్సెస్స్ ఆయ్యాడు.ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరమీద చూడాలనుకొనే ప్రేక్షకుల అంచనాలకు ఏమీ తగ్గకుండా తన కామెడీ మార్క్ డైలాగులతో, సన్ని వేషాలతో ఆడియన్స్ ని నవ్వేలా చేశాడు దర్శకుడు మారుతి.ఈ సినిమాలో కామెడీతో పాటు ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్‌ డ్రాప్‌ సెటప్, పాత్రల ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సంగీతం.అనూప్ రూబెన్స్ అద్బుతమైన సంగీతాన్ని అందించాడు ఇందులో ఉన్న పాటలు అన్నీ బాగున్నాయి.సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది .ఎడిటింగ్ పనితీరు బాగుంది. నిర్మాతలు SKN, U.V క్రియేషన్స్ సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో తీసిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి “మంచి రోజులు వచ్చాయి” చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు.

రేటింగ్: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here