బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అభిజీత్‌..?

బుల్లితెర‌లో విశేష ఆద‌ర‌ణ పొందుతున్న షోల‌లో బిగ్ బాస్ షో ఒక‌టి. ప్ర‌స్తుతం బిగ్ బాస్ 4వ సీజ‌న్ ఇప్పుడు న‌డుస్తోంది. కోట్ల మంది అభిమానులు బిగ్‌బాస్ కోసం రోజూ ఎదురుచూస్తుంటారు. అయితే ఆ షో నేటితో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం షో ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఫైనల్ విన్న‌ర్ ఎవ‌ర‌న్న దానిపై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

బిగ్‌బాస్ 4 షో 16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు మాత్ర‌మే ఉన్నారు. అభిజీత్‌, అఖిల్‌, అరియానా, హారిక, సోహైల్‌లు విజేత‌గా నిలిచేందుకు పోటీ ప‌డుతున్నారు. అయితే వీరిలో ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై ఇప్ప‌టికే ప‌లువురు విశ్లేష‌ణ చేస్తున్నారు. ఫైన‌ల్ విజేత‌గా అభిజీత్ నిలుస్తార‌న్న వార్త‌లు బాగా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. రాత్రికి బిగ్‌బాస్ 4లో అభిజీత్ గెలిచి తీరుతార‌ని ఆయ‌న అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ప‌లు సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ల‌లో కూడా అభిజీత్ పేరే వినిపిస్తోంది. ఏదిఏమైనా దీనికోసం మ‌నం రాత్రి వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. కాగా నేడు ఫైన‌ల్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎవ‌రు వ‌స్తార‌న్న దానిపై కూడా ఉత్కంఠ‌త నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here