ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా బాల‌కృష్ణ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా వ‌స్తుందంటే ఆయ‌న అభిమానులే కాకుండా సినీ ఇండ‌స్ట్రీ మొత్తం చ‌ర్చించుకుంటుంది. ఎందుకంటే బాల‌య్య సిమాల్లోని డైలాగ్‌లు, డ్యాన్సులు అంద‌రిలో చ‌ర్చ‌కు దారితీస్తాయి. తాజాగా బాల‌య్య న‌టిస్తున్న చిత్రంపై కూడా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.

ప‌వ‌ర్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య తీసిని సినిమాలు ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. బాల‌య్య ప‌వ‌ర్‌కు త‌గ్గ‌ట్టు డైలాగ్‌లు, స్టోరీ ఉండ‌టంతో అభిమాన‌ల‌కు బాగా క‌నెక్టు అయ్యాయి ఈ సినిమాలు. అయితే ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్ అయ్యింది. వారణాసిలో షూట్‌ చేయాల్సిన షెడ్యూల్‌ను కోవిడ్‌ పరిస్థితుల కారణంగా కర్నూలులోని నంధ్యాల ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. అందులో ఒకటి అఘోరా పాత్ర. మరో పాత్ర గురించి సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల మేరకు బాలకృష్ణ తన 106వ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఐఏయస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్‌.

ఈ రెండు పాత్రలను తనదైన స్టైల్లో బోయపాటి శ్రీను ఆవిష్కరిస్తున్నారట. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పూర్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సింహా, లెజెండ్ వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here