మాయోన్ నుంచి విడుద‌లైన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘మాంపాహి’ కి అనూహ్య స్పందన..

సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాయోన్’. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్సాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహి’ అనే పాట విడుదలైంది. దీనికి మంచి అప్లాజ్ వస్తుంది. మ్యూజిక‌ల్ మేజిషియ‌న్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో ఈ సినిమా వస్తుండటం విశేషం. కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం.

ఇక తాజాగా విడుద‌లైన మాంపాహి పాట ఇప్పుడు తెలుగు, త‌మిళ రాష్ట్రాల్లో ఉన్న ఇళ‌య‌రాజా అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది, అంతే కాదు అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కులు ఈ పాట‌కు అనూహ్య స్పంద‌న అందిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంతేకాదు ఈ పాట తమిళ వెర్ష‌న్ యూ ట్యూబ్ లో 24 గంటల లోపే మిలియ‌న్ వ్యూస్ పైగా అందుకోవ‌డం విశేషం. రామ్ పాండ్యన్ – కొండల రావు ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాను సీనియర్ సినిమాటోగ్రాఫ‌ర్ రామ్ ప్రసాద్ అత్యద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్లుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. అలానే ఈరోజు వైకుంఠఏకాద‌శి, గీత జ‌యంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కులంద‌రికీ మాయోన్ చిత్ర యూనిట్ శుభ‌కాంక్ష‌లు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుద‌లవ్వ‌నున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here