బన్నీ సత్తా ఇదీ.. రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.వాళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో మొదట వచ్చిన ఆర్య మూవీ సంచలన విజయం సాధించింది. సెకండ్ మూవీ గా వచ్చిన ఆర్య -2 కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక వీరు ముగ్గురు కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న సినిమా పుష్ప. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా నిర్మిస్తుండగా తొలి భాగానికి పుష్ప ది రైజ్.. అని పేరు పెట్టారు. డిసెంబర్ 17వ తేదీ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు.

రేపు సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. కాగా బన్నీ కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీ చేస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో చేసింది. సుకుమార్ గత సినిమా రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలబడడం, అల్లు అర్జున్ లాస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కావడంతో.. తర్వాతి సినిమాగా వస్తున్న పుష్ప పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పుష్ప నుంచి ఇప్పటి దాకా విడుదలైన లిరికల్ సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో ఈ మూవీపై భారీ క్రేజ్ నెలకొంది. దీంతో బన్నీ కెరీర్లోనే తొలిసారిగా పుష్ప మూవీ రూ.250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ అయిన ఓటీటీ డిజిటల్ రైట్స్ కలుపుకొని ఈ మూవీ రూ. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక మలయాళంలో బన్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించే తెలుగు సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్ అయి యూట్యూబ్ లో భారీగా వ్యూస్ సంపాదించుకున్నాయి.దీంతో హిందీలో కూడా బన్నీకి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ కారణాల వల్లే పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న పుష్పపై దేశవ్యాప్తంగా అటు ట్రేడ్ లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఓ స్పెషల్ సాంగ్ లో సమంత కనిపించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here