సాగర తీరాన రష్మిక వర్కవుట్లు చూశారా.?

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి రష్మిక మందన. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా బిజీ హీరోయిన్ గా మారింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో రష్మికకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే వర్కవుట్ల విషయంలో మాత్రం రష్మిక అస్సలు నిర్లక్ష్యంగా ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే ఈ బ్యూటీ నిత్యం జిమ్ లో కుస్తీలు పడుతుంది.

అయితే జిమ్ లో చేయాల్సిన వర్కౌట్‌ ను సముద్రపు ఒడ్డున చేస్తోందీ ముద్దుగుమ్మ. ఇందుకోసం జిమ్‌ పరికరాలను సముద్ర ఒడ్డుకు తీసుకెళ్లి మరీ వర్కౌట్లు చేసేస్తోంది. ఈ సందర్భంగా తీసిన వీడియోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియోతో పాటు ‘ఇది నా మొదటి బీచ్‌ వర్కౌట్‌.. నిజంగా చెబుతున్నా చాలా అలసిపోయా, కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు సముద్రం ఒడ్డున వ్యాయామం చేయడానికి అలవాటు పడిపోయా. అలల శబ్దం.. సముద్రం సువాసన.. సూర్యోదయాన్ని చూడటం.. నా కాళ్ల కింద ఇసుక.. ఇదంతా చాలా అందంగా ఉంటుంది’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here