కలెక్టర్, ఎస్పీ కూతురికి ఇలాగే జరిగితే వారు తట్టుకుంటారా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌త్రాస్ లో యువ‌తి అత్యాచార ఘ‌ట‌న‌లో బాదితురాలి కుటుంబ స‌భ్యులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అత్యాచారం త‌ర్వాత బాదితురాలిని చంపేందుకు దుండ‌గులు ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. అయితే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఆమెకు అర్ద‌రాత్రి అంత్య‌క్రియ‌లు చేసిన ఉదంతంపై స‌ర్వ‌త్రా ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే ఘ‌ట‌న‌పై బాదితురాలి కుటుంబ స‌భ్యులు స్పందిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు కూతురి కడసారి చూపు కూడా లభించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురి నడుము విరగలేదని ఎస్పీ, కలెక్టర్ చెబుతున్నార‌ని.. వారంతా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు కూతురి కడసారి చూపు కూడా లభించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీ కూతురికి ఇలాగే జరిగితే వారు తట్టుకుంటారా.. తాము  దళితులం కాబట్టే ఇలా చేస్తున్నార‌ని బాదితురాలి త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌గా కుటుంబీకులు మండిప‌డ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాదితురాలి కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌న్నారు. దోషుల‌క శిక్ష ప‌డేవిధంగా చూస్తామ‌ని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కాగా చ‌నిపోయిన ఆ యువ‌తి మృత‌దేహాన్ని హాస్పిట‌ల్ నుంచి తీసుకెళ్లి రాత్రి అంత్య‌క్రియ‌లు చేశార‌ని తెలుస్తోంది. అయితే ఈవిష‌యంపై మేజిస్ట్రేట్ మాట్లాడుతూ కుటుంబ స‌భ్యుల అనుమ‌తితోనే అంత్య‌క్రియ‌లు జరిగాయ‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here