బ‌స్తీమే స‌వాల్‌.. స్వీక‌రించేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మా..

ఏపీలో అధికార పార్టీపై పై చేయి సాధించాల‌న్న తొంద‌ర‌లో ప్ర‌తిప‌క్ష టిడిపి ఏం చేస్తుందో తెలియ‌డం లేన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే తాజాగా జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు. తాజాగా చిత్తూరు జిల్లాలో జ‌రిగిన జ‌డ్జి రామ‌కృష్ణ త‌మ్ముడు రామ‌చంద్ర ఘ‌ట‌న‌లో కూడా టిడిపి ఏం చేస్తుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు.

రామ‌చంద్ర‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఇరికించేందుకు తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించడం లేద‌ని ఏపీ రాజ‌కీయాల్లో టాక్ న‌డుస్తోంది. అయితే పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఘ‌ట‌న‌పై డీజీపీకి లేఖ రాయ‌గా.. మిగిలిన నేత‌లు వైసీపీపై మాట‌ల దాడులు చేస్తూ కామెంట్లు చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. అయితే పోలీసుల విచార‌ణ‌లో దాడికి పాల్ప‌డింది టిడిపికి సంబంధించిన వ్య‌క్తే అని తేలింది.

కాగా ఘ‌ట‌న‌పై మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి స్పందించారు. చంద్ర‌బాబుకు బ‌హిరంగ స‌వాల్ విసారారు పెద్దిరెడ్డి. జ‌డ్జి సోద‌రుడిపై దాడి చేసింది వైసీపీ కార్య‌క‌ర్త‌లే అని నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న చంద్ర‌బాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి స‌వాల్‌ను స్వీక‌రిస్తారా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారుతోంది. దాడి చేసింది వైసీపీనే అని చెబుతున్న టిడిపి.. ఈ స‌వాల్‌ను స్వీక‌రించాల‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here