కోవిడ్ పేషెంట్ల‌కు ఉచిత వైద్యం అందించ‌డానికి మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు

ఆ దేవుడు శాసిస్తాడు- అరుణాచ‌లంపాటిస్తాడు అన్న‌ది ర‌జ‌నీకాంత్ సినిమాడైలాగ్. కానీ ఇక్క‌డ మ‌న మేడ్చ‌ల్ లో తండ్రి మ‌ల్లారెడ్డి శాసిస్తారు- కొడుకు భ‌ద్రారెడ్డి పాటిస్తారు అన్న మాట ఎక్కువ‌గా వినిపిస్తోంది. మంత్రిగా ఉండి తాను చేయ‌లేని ఎన్నో ప‌నులు త‌న త‌న‌యుల చేత చేయించ‌డం మ‌ల్లారెడ్డికి ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు.. అందులో భాగంగా తండ్రి మంత్రి మ‌ల్లారెడ్డి ఆదేశాల‌ను పాటిస్తూ.. కొడుకు డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి మేడ్చ‌ల్ జిల్లా బోడుప్ప‌ల్ ప్ర‌జ‌ల పాలిట ఆప‌ద్బాంధ‌వుడిగా మారారు..

మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రి అధినేత అయిన భ‌ద్రారెడ్డి.. క‌రోనా సెకండ్ వేవ్ విస్త‌రిస్తున్న వేళ‌.. త‌న ఉదార‌త‌ను చాటుతున్నారు. ఇప్ప‌టికే ఆస్ప‌త్రి క‌రోనా విభాగ‌మైన మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ లో 300 బెడ్స్ గ‌ల ఐసోలేష‌న్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బ‌య‌ట ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో బెడ్స్ దొర‌క్క‌- బెడ్స్ దొరికినా ఆక్సిజ‌న్ అంద‌క క‌రోనా పేషెంట్లు ఊపిరిపోతున్న ప‌రిస్థితుల్లో భ‌ద్రారెడ్డి త‌న ఆస్ప‌త్రిలో ఉచిత వైద్యం అందించ‌డం.. ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టం.

కోవిడ్ పేషెంట్ల‌కు ఉచిత వైద్యం అందించ‌డానికిగానూ.. మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసి.. మేడ్చ‌ల్ ప్ర‌జ‌ల‌కు ఉచిత వైద్య సేవ‌ల‌ను అందిస్తున్నారు భ‌ద్రారెడ్డి. 19- 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సుగ‌ల‌.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు గ‌ల కోవిడ్ పాజిటివ్ గ‌ల వారికిదోఅద్భుత అవ‌కాశం. ఈ కేర్ సెంట‌ర్ లో ఇర‌వై నాలుగు గంట‌లూ డాక్ట‌ర్లు, న‌ర్సులు అందుబాటులో ఉంటున్నారు. అంతే కాదు రోజూ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్- మ‌ధ్యాహ్నం రాత్రి. భోజ‌న స‌దుపాయం. వీటితో పాటు ఉచితంగా ప్రైమ‌రీ మెడిస‌న్ అందిస్తుండ‌టం విశేషం. మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రి వారి సౌజ‌న్యంతో న‌డుస్తోన్న ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్లో అత్య‌వ‌స‌ర మెడిక‌ల్ బ్యాక‌ప్ సైతం ఉంచుతున్నారు- ఆక్సిమీట‌ర్, ధ‌ర్మామీట‌ర్- శానిటైజ‌ర్- మాస్క్- స్టీమ్ ఇన్హెల‌ర్ వంటి వాటితో మెడికల్ కిట్లను అంద‌జేస్తున్నారు.

ఐసీఎంఆర్ ఆమోదించిన లాబ్స్ ద్వారా కోవిడ్ టెస్టు రిపోర్టులు పొందిన వారు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన వెంట‌నే మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ స్పందించ‌డం మొద‌ల‌వుతుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ ఈ కేర్ సెంట‌ర్ లో చేరే అవ‌కాశ‌ముంటుంది. గుర్తింపున‌కు రుజువుగా ఆధార్ లేదా ఓట‌ర్ ఐడీ ఉంటే చాలు.. ఇక్క‌డ సులువుగా అడ్మిష‌న్ దొరికేస్తుంది.. ఇలా డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి త‌న‌కు చేత‌నైన విధంగా.. స్థానిక ప్ర‌జ‌ల‌కు త‌న‌దైన వైద్య‌సేవ‌ల‌ను అందిస్తూ ప్ర‌శంస‌లు పొందుతున్నారు.

గ‌తంలో కూడా డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి రోగుల ప‌ట్ల త‌న ఉదార‌త చాటుకున్న దాఖ‌లాలు అనేకం ఉన్నాయి. 2021 ఏప్రిల్ 17న మేడ్చ‌ల్ లో మున్సిప‌ల్ సిబ్బంది డ‌బిల్ పుర ల‌క్ష్మి విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఆమెను ఒక టిప్ప‌ర్ ఢీకొట్ట‌డంతో ప్రాణాపాయ‌ప‌రిస్థితికి చేరారు. వెంట‌నే ద‌గ్గ‌ర్లో ఉన్న మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రిలో చేర్చారు.

అస‌లే ల‌క్ష్మి పేద‌రాలు. ఆపైన ప్రాణాపాయ ప‌రిస్థితి. ఆమె స్థితిగ‌తుల‌ను గుర్తించిన మేడ్చ‌ల్ ఛైర్ ప‌ర్శ‌న్ దీపికా రెడ్డి భ‌ద్రారెడ్డికి వివ‌రించారు. డబ్లుక‌న్నా ప్రాణాలు మిన్న‌గా న‌మ్మే.. డాక్ట‌ర్ భ‌ద్రారెడ్డి ల‌క్ష్మి ఆర్ధిక ప‌రిస్థితిని గుర్తించి.. ఆమె ఉచిత వైద్య సేవ‌లందించారు.

భ‌ద్రారెడ్డి ద‌య త‌ల‌చ‌కుంటే ఈ పాటికి ల‌క్ష్మి ప్రాణాలు త‌మ‌కు ద‌క్కేవి కావ‌ని అంటారు ఆమె కుటుంబ స‌భ్యులు. డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌ని అంటారు. వీళ్లే కాదు.. మేడ్చ‌ల్ నాల్గో వార్డు కౌన్సిల‌ర్ తుడుం గ‌ణేష్ సైతం భ‌ద్రారెడ్డి గ‌తంలో పేద‌ల‌కు చేసిన ఇలాంటి ఎన్నో స‌హాయ స‌హ‌కారాల‌ను గుర్తు చేశారు. వీరితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయ‌కులు మ‌ర్రి న‌ర‌సింహారెడ్డి సైతం భ‌ద్రారెడ్డి సేవ‌ల‌ను కీర్తిస్తారు…

పేద‌ల‌కు ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ప‌ట్ల ఎలా స్పందిస్తారో. ఆర్ధిక దుస్థితి ఎదురైన‌పుడు కూడా భ‌ద్రారెడ్డి సరిగ్గా లాగే స్పందిస్తార‌న్న పేరుంది. క‌రోనా క‌ఠిన ప‌రిస్థితుల న‌డుమ పేద‌లు త‌గిన ఆహార నిల్వ‌లు లేక ఆక‌లికి అల‌మ‌టిస్తున్న వేళ‌..ఆయ‌న వారికి అండ‌దండ‌గా నిలిచి.. ఆర్ధికంగా సాయం చేసిన ప‌రిస్థితులున్నాయి. ఈ ప్రాంతంలో భ‌ద్రారెడ్డి పేరు వినిపించిన‌పుడు.. ఇలాంటి ఎన్నో అనుభ‌వాలతో కూడిన మాట‌లు వినిపిస్తాయి. ద‌టీజ్ భ‌ద్రారెడ్డి.. ఆయ‌న రోగుల నాడి తెలిసిన వైద్యుడు మాత్ర‌మే కాదు- ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిసి వ్య‌వ‌హ‌రించే మాన‌వ‌తావాది కూడా అంటారు.. స్థానికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here