బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అభిజీత్‌కు అంత అమౌంట్ ఎందుకు ఇచ్చారు..

బుల్లితెర‌లో వంద రోజుల పాటు సంద‌డి చేసిన బిగ్‌బాస్ 4 షో ముగిసిపోయింది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ షోలో విన్న‌ర్‌గా అభిజీత్ నిలిచిపోయాడు. షో ఆరంభం నుంచి చివ‌ర‌కు ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది బిగ్‌బాస్‌. అయితే ఇప్పుడు షోలో పార్టిసిపెంట్స్ రెమ్యున‌రేష‌న్ గురించి వార్త‌లు ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

బిగ్‌బాస్‌4లో ఉన్న కంటెస్టెంట్లు అంద‌రినీ వారానికి కొంత మేర అమౌంట్ ఇచ్చారు. అయితే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న వారిలో ప‌లువురి పేర్లు వినిపించాయి. టీవీ యాంకర్‌ లాస్యకు ఒక వారానికి లక్ష రూపాయలని, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్‌ వారానికి ఏకంగా 2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు పుకార్లు వినిపించాయి. ఇక విజేత‌గా నిలిచిన అభిజీత్ రూ. 25 లక్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా అభిజీత్ హౌస్‌లో ఉన్న‌న్ని రోజుల‌కు క‌లిపి రూ. 60 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వారానికి రూ. 4ల‌క్షల చొప్పున అభిజీత్‌కు ఇచ్చిన‌ట్లు టాక్‌. కాగా మొత్తం బిగ్‌బాస్ షో 106 రోజుల పాటు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. అభిజీత్ గెలిచిన ప్రైజ్ మ‌నీకంటే హౌస్‌లో ఉన్నందుకే ఎక్కువ అమౌంట్ గెలుచుకున్న‌ట్లు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here