ఇటీవల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రోజులో కొంత సమయాన్నైనా ఫిట్నెస్ కోసం కేటాయిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు తమ ఫిట్నెస్ కాపాడుకోవడానికి వర్కవుట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on
తాజాగా బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. వైట్ కలర్ స్పోర్ట్స్ బ్రా.. పింక్ ప్యాంట్లో నౌకాసనం వేస్తోన్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. ‘ప్రతీ రోజునూ సద్వినియోగం చేసుకోండి’ అనే క్యాప్షన్‌తో పాటు తాను వేసిన నౌకాసన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన మలైక కోలుకున్న విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ యోగసనాలు వేస్తోన్న మలైకను చూసిన వారు ఫిదా అవుతున్నారు. మరి ఈ అందాల తార వర్కవుట్లకు సంబంధించిన కొన్ని ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.