‘రాధేశ్యామ్‌’లో ప్రేరణ ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..!

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి పూజా హెగ్డే. తన క్యూట్‌ నటన అందమైన రూపంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారింది. ఇక అల వైకుంఠపురంలో బుట్ట బొమ్మ పాటలో తళుక్కుమని ఆకట్టుకున్న ఈ చిన్నది నేటితో 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూజా హెగ్డే పుట్టిన రోజు ఈ సందర్భంగా పూజాకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక పూజా పుట్టినరోజును పురస్కరించుకొని తాజాగా ‘రాధేశ్యామ్‌’ చిత్ర యూనిట్‌ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో పూజా .. ప్రేరణ అనే పాత్రలో నటిస్తోంది. చిత్ర యూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌లో గ్రీన్‌ డ్రస్‌లో పూజా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఫొటోను గమనిస్తే పూజా రైళ్లో కూర్చోగా ఆమెకు ఎదురు సీట్‌లో ప్రభాస్‌ కూర్చుకున్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ చిత్రం  రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతుండ‌గా, యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here