శ్రీవారి సేవలో దిల్‌రాజ్‌ దంపతులు..

ఇంటి పేరునే సినిమా పేరుగా మార్చుకున్న నిర్మాత దిల్‌రాజ్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్వినితో కలిసి తిరుమల వచ్చారు దిల్‌రాజు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు దిల్‌రాజ్‌ దంపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన దిల్‌రాజ్‌ను మీడియా ప్రతినిధులు పలకరించగా ఆయన మాట్లాడ్డానికి నిరాకరించారు. వివాహం తర్వాత దిల్‌రాజ్‌ దంపతులు తిరులమను సందర్శించడం ఇది రెండోసారి.

ఇక దిల్‌ రాజ్‌ మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న దిల్‌రాజ్‌ తన కూతురు బలవంతం మేరకు ఈ ఏడాది మే నెలలో తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here