ఒక్క రోజు వ్యవధిలోనే రెండు భారీ అప్డేట్‌లు..

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు, సినిమా చిత్రీకరణలు ఆగి పోయాయి. వారాంతం సరదాగా సినిమాకి వెళ్లే సగటు సినీ  ప్రేక్షకుడు..  ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అంతేనా.. ట్రైలర్, టీజర్ విడుదల అంటూ ఎప్పుడు హడావుడిగా ఉండే సోషల్ మీడియా కూడా సినిమా అప్డేట్లు లేక కొన్ని రోజులు మూగబోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో మార్పు వస్తోంది. కేంద్రం ఇచ్చిన సడలింపుల ఆధారంగా సినిమా చిత్రీకరణలు మొదలవుతున్నాయి. ఈ తరుణంలోనే తమ చిత్రాలకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు రెండు భారీ సర్ ప్రైజ్ లు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ టీజర్ కాగా.. మరొకటి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అప్డేట్.

ఈనెల 22న కొమరం భీమ్ జయంతి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక కొమరం భీమ్ టీజర్ రిలీజైన 24 గంటలకు రాధేశ్యామ్ టీజర్ కూడా రాబోతోంది. 23న ప్రభాస్ పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా ఒక్క రోజు వ్యవధిలోనే రెండు భారీ చిత్రాలకు సంబంధించిన అప్డేట్లు వస్తుండడం విశేషం. అందులోనూ ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుండడం మరో విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here