ట్విట్టర్‌లో వర్మ అరాచకం..!

లాక్‌డౌన్‌ సమయంలోనూ వరుస సినిమాలు చేసి సంచలనాలకు తెరతీసిన వర్మ ప్రస్తుతం ‘దిశ’ చిత్రంతో మళ్లీ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్‌లో వేడిని రగిల్చిన వర్మ ఇప్పుడు గోవాలో తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు. పేరుకు షూటింగ్‌ కోసం వెళ్లినా ట్విట్టర్‌లో ఆయన పోస్ట్‌ చేసిన ఫొటోలు చూస్తుంటే ఏదో విహారయాత్రకు వెళ్లినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రామ్‌ గోపాల్‌ వర్మ నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో ‘డేంజరస్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలో గోవాలో షూటింగ్‌ చేస్తోన్న సమయంలో ఇద్దరు హీరోయిన్లతో కలిసి దిగిన ఫొటోలను, షూటింగ్ స్పాట్‌లో హీరోయిన్ల హాట్‌ హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నాడు వర్మ. ఇండియాలోనే తొలి లెస్బియన్‌ క్రైమ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ అని ప్రకటించి సంచలనానికి తెర తీశాడు. అంతేకాకుండా ఈ లెస్బియన్స్‌ ఎఫైర్‌ చాలా మందిని చంపేసిందని.. వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్‌ కూడా ఉన్నారని పోస్టర్‌పై తెలిపి మరో కొత్త చర్చకు దారి తీశాడు. వర్మ షేర్‌ చేసిన ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here