బుల్లి తెరపై సందడి చేయనున్న ‘సాహో’..!

బాహుబలిలాంటి సంచలన విజయం అందుకున్న తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం సాహో. సుజిత్‌ వంటి యంగ్‌ డైరెక్టర్‌తో చేతులు కలిపి ప్రభాస్‌ పెద్ద సాహసమే చేస్తున్నాడని సినిమా షూటింగ్‌కు ముందు కొందరు కామెంట్లు చేశారు. అయితే సుజిత్‌ అభిమానుల అంచనాలను అందుకున్నాడు. సాహో చిత్రం దక్షిణాదిలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా.. ఉత్తరాదిలో మాత్రం సెన్సేషన్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్‌ స్టైలిష్‌ నటనకు నార్త్‌ ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే విడుదలైన ఏడాది తర్వాత సాహో చిత్రం మరోసారి సందడి చేయనుంది. అయితే ఈసారి బుల్లితెరపై సాహో సందడి షురూ కానుంది. సాహో శాటిలైట్‌ హక్కులను కొనుగోలు చేసిన జీ తెలుగు ఛానెల్‌ ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు సాహో చిత్రాన్ని ప్రసారం చేయనుంది. దీంతో మళ్లీ సాహో చిత్రం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బిగ్‌ స్క్రీన్‌ వండర్స్‌ క్రియేట్‌ చేసిన సాహో బుల్లి తెర రేటింగ్‌లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here