నిమ్స్ వాక్సిన్ స్కాం లో ఇవేనా నిజాలు?

గురివింద గింజ నలుపెరుగని‌ చందంగా నిమ్స్‌లో లో అధికారుల తీరుమారిపోయింది. మొత్తం 22వేల వ్యాక్సిన్ లలో 7 వేల వ్యాక్సిన్ లు అనర్హులకు వేసారనే అంశం లో నిజానిజాలు ఒక్కొక్కటి‌బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వున్న నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అంశం లో విస్తుపోయే నిజాలు‌కూడా బయటకు వస్తున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణ లో నిజమెంత? అబద్దం ఎంత అన్నది ఇప్పుడు చర్చగా మారింది. కప్పెల తక్కెడ వ్యాక్సిన్‌ డోస్ ల లెక్కల తో నిజాలకు పాతర వేసే ప్రయత్నం జరుగుతోంది.

నిమ్స్‌ లో *వ్యాక్సినిజంఇదే!!!??*

అందుతున్నటి సమాచారం బట్టి లో నిమ్స్‌లో లో తొలుత టీకా అవకతవకల్లో నిమ్స్‌లో ని సీనియర్ డాక్టర్ ల దగ్గర నుండి ల్యాబ్ అసిస్టెంట్ లకు రెండు డోసుల వ్యాక్సిన్ లు..వారికే కాకుండా , వ్యాక్సిన్ వేసుకునే వయసు,అర్హత లేని‌ నిమ్స్‌లో ని సిబ్బంది ,వారి బంధువులకే అధికంగా కోవిడ్ టీకాలు ,ఫస్ట్,సెకండ్ డోస్ వ్యాక్సిన్ల వాడకం జరిగినట్టు తెలుస్తోంది.

వీరు కూడా వ్యాక్సిన్ అవకతవకల్లో పాత్రదారులే.నిమ్స్‌ సిబ్బంది‌,వైద్యులు ,వారి పిల్లలు తర్వాత
రెండో వరుసలో IAS అధికారుల పిల్లలు,వారి బంధుగణాని అనధికారికంగా ,అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాక్సిన్ ల వాడకం అడ్డుగోలుగా జరిగింది. తమ పేషీలలో పని చేసే అసిస్టెంట్ లను జత చేసి వారి 45 ఏళ్ల లోపు వున్న వారిపిల్లలకు,బంధువులకు వారి పిల్లలకు కూడా నిమ్స్‌లోనే వ్యాక్సిన్ వేయించి IAS అధికారులు కూడా నిమ్స్‌ కోటా లో వున్న వ్యాక్సిన్ అవకతవకల్లో ప్రధాన పాత్ర పోషించారని తెలుస్తోంది. వీటికి నిమ్స్‌లో వున్న సీసీ కెమెరాలో ప్రత్యక్ష సాక్ష్యం.

బ్యూరో క్రాట్స్ తర్వాత అధికార,ప్రతిపక్ష పార్టీల్లో వున్న ప్రజాప్రతినిధుల హూంకరింపుకు సగం‌ వ్యాక్సిన్ లు ఖాళీ అయిపోయాయని నిమ్స్‌ సిబ్బంది చెబుతున్నారు.వ్యాక్సిన్ వేయించుకోవడానికి 45 సంవత్సరాలు అర్హత లేకపోయినా..వ్యాక్సిన్ విభాగం అధికారులపై బ్యూరోక్రాట్స్,MLA,MP ల బంధుగణం కోసం వ్యాక్సిన్ రికమెండేషన్ లతో నిమ్స్‌లో ఏప్రిల్,మే నెలల్లో వ్యాక్సిన్ జాతర జరిగిందని ఆధార్ కార్డ్, అడిగినా ఇవ్వని ప్రజా ప్రతినిధులు,బ్యూరోకాట్ల బంధుగణం దెబ్బకు సుబ్బు పెళ్లి‌ఎంకి‌ చావుకొచ్చిన. చందగా నిమ్స్‌లో ఉద్యోగుల పరిస్థితి మారిపోయింది.

ఇక మీడియా సంస్థ ల్లో పని చేస్తూ పెద్ద పెద్ద హోదాల్లో వున్న జర్నలిస్టు ల పిల్లలకు అర్హత లేకపోయినా కలం,కెమెరా బలం ఉపయోగించి వ్యాక్సిన్ అవకతవకల్లో కీలకపాత్ర పోషించారన్నది‌ ప్రధాన సమాచారం.హైదరాబాద్ నడిబొడ్డున వున్న ఓ‌ మీడియా సంస్థ ఉద్యోగులైతే తాగితే ఇరానీ చాయ్ తాగాలి..వేయించుకుంటే నిమ్స్‌లోనే వ్యాక్సిన్ వేయించుకోవాలనే పెన్ను‌ బలంతో నిమ్స్‌ ఆసుపత్రి కాంపౌండ్ లో వున్న తాజ్ బెల్సన్ హోటల్ దగ్గరకు చేరి‌మరి దొంగ చాటుగా వేయించుకున్నారు..ఇప్పుడు మీడియ సంస్థల్లో వున్న వారి దృశ్యాలు‌ కూడా నిమ్స్‌ ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు‌కూడా తెలుస్తోంది.

ప్రజారోగ్యం కోసం నిమ్స్‌లో వున్న వ్యాక్సిన్ స్టాక్‌లో జరిగిన ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ విచారణకు ఆదేశించడం శుభపరిణామం ,ఆహ్వానించదగినదే. విచారణ అధికారులు‌ కూడా తొలి అడుగు నిమ్స్‌లో పని చేస్తున్న సిబ్బంది ని విచారించాలి?? వారి బంధుగణానికి ఎన్ని‌డోసులు ఎంత డబ్బులిచ్చి‌వేయించారో‌లెక్క తేల్చాలి?? అర్హులైన వారికి, సామాన్యుడికి‌కోసం‌ నిమ్స్‌లో వున్న కోవాగ్జిన్ ,కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను ఏరి కోరి వేయించుకున్న. బ్యూరో‌క్రాట్స్ పిల్లలు,బంధువుల సమాచారాన్నిం సేకరిచాలి ,అధికారుల పాత్ర ను నిగ్గు తేల్చాలి.ఇక బుగ్గ కారు లేకపోయినా లాక్‌డౌన్ సమయం‌లో‌నిబంధనలు గాలికొదిలేసి తమ వాహనాల్లో బంధువులను,18 ఏళ్లు దాటి అర్హులు కాకపోయినా పార్టీల కండువాబలంతో వ్యాక్సిన్ లు వేయించుకున్న వారిపై కూడా విచారణ జరపాలి.

ఉదయం‌నిద్ర లేచినప్పటి నుండి సత్యమేవ జయతే నినాదం తో‌ వార్తలు రాసే మీడియా సంస్థల ఉద్యోగులు.వ్యాక్సిన్‌ వేయించుకునే వయసు,.అర్హత లేకపోయినా ఎంత మంది జర్నలిస్ట్ లు,రిపోర్టర్లు,కెమెరామాన్ లు, చానెల్స్ సిబ్బంది, పత్రిక యాజమాన్యాల బంధువుల జాబితా కూడా తీయాలి.

నిమ్స్‌లో 7వేల కోవిడ్ వ్యాక్సిన్‌ల దుర్వినియోగం సామాన్యుడికి చేసే అర్హత,అధికారం లేదన్నది ఓపెన్ సీక్రెట్.
మరి వ్యాక్సిన్ అవకతవకల్లో నిమ్స్‌లో వున్న సిబ్బంది,అధికారగణం,బ్యోరో క్రాట్ బాబులు, ప్రజా ప్రతినిధులు, మీడియా సంస్థల్లో‌ నిజాలు మాత్రమే చెప్పే వారి ప్రమేయం‌లేకుండా జరిగి వుంటుందా??

ఎందుకంటే ఏ కలుగులో ఏ పాము వుందో ఎక్కువగా తెలుసేది ఈ రంగాలలో వున్నవారికే కదా!!?? మరి నిమ్స్‌లో వ్యాక్సిన్ తీగ ల డొంకలో దొంగలెవరో బయటకొస్తే వ్యాక్సిన అవకతవల్లో నిజాలు మాత్రమే బయటకు వస్తాయన్నది నిమ్స్‌ సిబ్బంది ఘంటాపథంగా చెబుతున్న మాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here