అల్లు శిరీష్, అను ఇమానుయెల్ కొత్త సినిమా టైటిల్ ప్రేమ కాదంట‌

యంగ్ హీరో అల్లు శిరీష్, మ‌ల్లూ బ్యూటీ అను ఇమానుయెల్ జంటగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ప్రేమ కాదంట‌. స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా నిలిచే జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, మ‌రో నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో క‌లిసి ఈ న్యూఏజ్ ల‌వ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత‌గా విజ‌య్.ఎమ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వినూత్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌న‌దైన శైలిలో ఎంట‌ర్ టైన్ చేస్తూ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న యంగ్ హీరో అల్లు శిరీష్ నుంచి ప్రేమ‌కాదంట సినిమాతో ఓ న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీ రాబోతుంద‌ని అనే విష‌యం గ‌త కొన్ని రోజులుగా విడుద‌ల చేసిన ప్రీ లుక్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తొలిసారిగా ఒకే స‌మ‌యంలో, ఒకే తేదిన రెండు ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేయ‌డంతో పాటు ప్రేమ‌కాదంట అనే టైటిల్ ని సైతం ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ప్రీలుక్స్ తో ప్రేమ కాదంట చిత్రానికి వ‌చ్చిన హైప్ ని మ‌రింత పెంచేలా తాజాగా విడుద‌ల చేసిన రెండు ఫ్ట‌స్ లుక్స్ ఉండ‌టం విశేషం. శిరీష్, అను అద్దంలో సెల్ఫీ దిగుతూ ముద్దు పెట్టే స్టిల్ తో మొద‌టి ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేస్తే, పోయటిక్ ఫీలింగ్ వ‌చ్చేలా రెండో ఫ‌స్ట్ లుక్ ని సిద్ధం చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా, ఫ్యాన్స్ ఇలా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటూ ప్రేమ కాదంట టైటిల్ అలానే రెండు ఫ‌స్ట్ లుక్స్ ట్రెండ్ అవుతున్నాయి. విజేత అనే సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి, ప్రేమ కాదంట చిత్రాన్ని సైతం ఆదత్యం అంద‌ర్ని ఆక‌ట్టుకునే రీతిన సిద్ధం చేస్తున్నార‌ని నిర్మాత విజ‌య్. ఎమ్ తెలిపారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాత‌, ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here