అల్లు శిరీష్ ప్రేమ కాదంట చిత్ర ఫస్ట్ లుక్ కు టాలీవుడ్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్..

అల్లు శిరీష్ అప్ కమింగ్ సినిమా ప్రేమ కాదంట ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. లావణ్య త్రిపాఠి నుంచి మొదలుకొని సాయి ధరమ్ తేజ్ పలువురు హీరో హీరోయిన్లు ఈ సినిమా పోస్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లవ్లీ పోస్టర్ అంటూ లావణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఈ ఏడాది నీకు బ్లాక్ బస్టర్ పక్కా అంటూ సాయి ధరమ్ తేజ్ కూడా విష్ చేశాడు .

కేవలం వీళ్లు మాత్రమే కాకుండా కుర్ర హీరో నిఖిల్, సందీప్ కిషన్, ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, కమెడియన్ వెన్నెల కిషోర్, రైటర్ గోపీమోహన్, హీరో కళ్యాణ్ దేవ్.. వీళ్లంతా ప్రేమ కాదంట పోస్టర్ గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. పోస్టర్ అద్భుతంగా ఉంది అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో ప్రమోట్ చేశారు. దాంతో పాటు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి అల్లు శిరీష్ ను అభినందించారు.

టాలీవుడ్ ప్రముఖుల నుంచే కాకుండా ట్రేడ్ అనలిస్టులు, జర్నలిస్టులు, టీవీ షో పోస్టుల దగ్గర నుంచి కూడా ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమిళ టీవీ యాంకర్లు దివ్యదర్శిని, నీలకందన్ ప్రేమ కాదంట పోస్టర్ గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అలాగే ఇతర ఇండస్ట్రీ నిర్మాతలైన మహేంద్ర సోనీ కూడా ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు శిరీష్, అను ఎమ్మాన్యూయేల్ జోడి చాలా బాగుంది అంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here