హోట‌ల్‌లో రివ్యూ త‌ప్పుగా ఇచ్చాడ‌ని కేసు పెట్టి బొక్క‌లో వేయించారు.

ఓ హోట‌ల్‌కి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ రివ్యూ స‌రిగ్గా ఇవ్వ‌లేద‌ని అత‌నిపై కేసు పెట్టారు. ఈ ఘ‌ట‌న థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన వెస్లే బార్స్ థాయ్‌లాండ్‌లో టీచ‌ర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల కో చాంగ్ ఐ లాండ్‌లోని సీ వ్యూ కో చాంగ్ రిసార్ట్ హోట‌ల్‌కు వెళ్లాడు. ఆ త‌ర్వాత రివ్వూ మాత్రం చాలా బ్యాడ్ గా ఇచ్చారు.

ఇలా ఎందుకు చేశాడంటే హోట‌ల్లో ఉన్న అత‌నికి వైన్ బాటిల్ తెచ్చి ఇచ్చినందుకు 15 యూఎస్ డాల‌ర్లు బిల్ వేశారు. దీంతో ఆగ్ర‌హానికి గురైన అత‌ను గొడ‌వ ప‌డి బిల్లును ర‌ద్దు చేయించుకున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా హోట‌ల్ పై రివ్యూ రాస్తే ఈ హోట‌ల్‌కు వ‌స్తే క‌రోనా వ‌స్తుంద‌ని చెప్పారు. దీంతో విషయం తెలుసుకున్న హోట‌ల్ యాజ‌మాన్యం ఇత‌నిపై కేసు వేసింది. కాగా ఈయ‌న బెయిల్‌పై విడుద‌ల అయ్యారు. అయితే ఇత‌ను చేసిన‌దానికి క‌చ్చితంగా రెండు సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష ప‌డుతుంద‌ని అంతా అనుకుంటున్నారు.

హోట‌ల్‌కు వెళ్లాలంటే ఇప్పుడు రివ్యూలు చూస్తున్నారు. అలాంటిది హోట‌ల్ గురించి త‌ప్పుగా ప్ర‌చారం చేస్తే ఈ మాత్రం శిక్ష ఉండ‌దా అని డిస్క‌ష‌న్ చేసుకుంటున్నారు. అయితే ఇత‌నిపై కేసు వేసే ముందు హోట‌ల్ యాజ‌మాన్యం అత‌నితో చ‌ర్చించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని అనుకుంద‌ట‌. కానీ వెస్లే నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు కోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here