అందాల ఆకాంక్ష బాల్కనీలో ఏం చేస్తుందో చూడండి..

టీవీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన నటి ఆకాంక్ష సింగ్ అనంతరం బద్రీనాథ్ కీ దుల్హనియా సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇక సుమంత్ హీరోగా నటించిన మళ్ళీరావా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఒక్క సినిమాతోనే నాగార్జున లాంటి బడా స్టార్‌ సరసన నటించే అవకాశం కొట్టేసింది ఆకాంక్ష. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. బాల్కనీలో బెడ్ సెటప్ చేసుకున్న ఈ బ్యూటీ.. అక్కడి నుంచి వ్యూ చూస్తూ ఎంచక్కా గరం గరం టీ తాగుతూ.. పుస్తకాలు చదువుతోంది. ఈ సమయంలో తీసిన ఫోటోను పోస్ట్ చేస్తూ… ‘నేను ఎల్లప్పుడూ హాయిగా ఉండే కార్నర్స్ లో బాల్కనీలలో టీ తాగడాన్ని ఆస్వాదిస్తాను’ అని రాసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here