సెక్స్‌ వర్కర్ల జీవితాల్లో ‘వెలుగులు’ నింపుతోన్న కరోనా..!

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వారు మరికొందరు. సంపన్నుల నుంచి పేద వాడి వారికి ప్రతి ఒక్కరిపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో పడింది. అయితే ప్రపంచాన్ని అతాలకుతలం చేసిన ఈ మహమ్మారి వేశ్య వృత్తి చేస్తోన్న వారికి మాత్రం కొత్త మార్గం చూపించింది.

పరిస్థితుల ప్రభావంతో కొందరు, ఆకలి బాధను తట్టుకోలేక మరికొందరు, పిల్లల భవిష్యత్తు కోసం మరికొందరు.. ఇలా ఇష్టం ఉన్నా లేకపోయినా పడుపు వృత్తిలో జీవితాన్ని గడుపుతోన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కరోనా కారణంగా ఢిల్లీ, జీబీ రోడ్డులో వేశ్య వృత్తిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వారు వేరే ఉపాధి వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ‘హునర్‌ జ్యోతి’ కార్యక్రమం వారికి అండగా నిలిచింది. మట్టి దీపాలకు రంగులు వేయటం, కాగితపు బ్యాగులు తయారు చేయటం, అగరుబత్తీలు, కీ రింగుల తయారీ, ఫ్యాబ్రిక్‌ పనుల్లో శిక్షణననిచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఈ కార్యక్రమం గురించి ఓ వేశ్య మాట్లాడుతూ.. ‘నేను 12 ఏళ్లుగా ఈ వృత్తినుంచి బయటపడదామని అనుకుంటున్నాను. కానీ, కుదర్లేదు. నా కూతురి భవిష్యత్తు కోసం ఏదైనా వేరే పని వెతుక్కోవాలనుకున్నా. ‘హునర్‌ జ్యోతి’ కార్యక్రమం ద్వారా మంచి అవకాశం లభించింది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇలా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఈ వేశ్యల జీవితాల్లో మాత్రం వెలుగు నింపుతుండడం నిజంగానే గొప్ప విషయం కదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here