ఐస్‌క్రీమ్‌ కోసం పాట్లు పడుతోన్న అందాల తార..!

కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల పాటు ఇంట్లోనే బంధీలుగా ఉన్న వారంతా ఇప్పుడిప్పుడే అడుగు బయటపెడుతున్నారు. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వస్తున్నారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. రయ్‌ రయ్‌ మంటూ విదేశాల బాట పడుతున్నారు. రెక్కలు విప్పిన పక్షుల్లా విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార మెహరీన్ ఫిర్జాదా దుబాయ్‌లో తెగ సందడి చేస్తోంది. విహార యాత్రలో భాగంగా దిగిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. సాధారణంగా విదేశాల్లో ఉండే కొన్ని ఐస్‌క్రీమ్‌ స్టాల్స్‌ దగ్గర సదరు స్టాల్‌ నిర్వాహకుడు కోన్‌ ఐస్‌ క్రీమ్‌ను చేతికి అందిస్తున్నట్లుగా నటిస్తూ ఆట పట్టిస్తుంటాడు. ఇలాంటి చాలా వీడియోలు రోజూ సోషల్ మీడియా వైరల్‌గా మారుతుంటాయి. అచ్చంగా అలాంటి ఓ స్టాల్‌ ముందే సందడి చేసిందీ బ్యూటీ. ఐస్‌ క్రీమ్‌ అందుకోవడానికి మెహరీన్‌ చేసిన ప్రయత్నం నవ్వుతెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే మెహరీన్‌ చివరిసారి నాగశౌర్య హీరోగా నటించిన అశ్వత్థామలో కనిపించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here