అందాల ‘రాశి’.. లంగావోణి అందాలు!

‘మనం’ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో తళుక్కుమంది అందాల తార రాశీఖన్నా. తొలి సినిమాతోనే యువతను ఆకట్టుకున్న ఈ చిన్నది ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తనలోని నటిని కూడా పరిచయం చేసింది. ఇక అనంతరం రాశీఖన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. జై లవ కుశ, టచ్‌ చేసి చూడు, తొలిప్రేమ, వెంకీమామ, వరల్డ్‌ ఫేమస్‌ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉందీ చిన్నది.

ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే రాశి.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఈ క్రమంలో తాజాగా లంగావోణిలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఈ ఫొటోల్లో అమాయక చూపులతో, పల్లెటూరి అమ్మాయిలా అందాలను ఒలకబోస్తూ ఆకట్టుకుంటోందీ చిన్నది. కేవలం గ్లామర్‌ అవుట్‌ ఫిట్స్‌ లోనే కాదు.. సంప్రదాయ డ్రస్‌లలో కూడా తన అందం ఏ మాత్రం తక్కువ కాదని చెప్పకనే చెబుతోందీ బ్యూటీఫుల్‌ యాక్టర్‌. మరి రాశీఖన్నా లంగావోణి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

☺️

A post shared by Raashi (@raashikhannaoffl) on

View this post on Instagram

Hello from the other side 💚

A post shared by Raashi (@raashikhannaoffl) on

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here