ఈ జంట మరోసారి మ్యాజిక్‌ చేయనుందా..?

సినిమాల్లో కొన్ని జంటలను ఎన్నిసార్లు చూసినా బోర్‌గా అనిపించదు. వారి కాంబినేషనల్‌ వచ్చిన సినిమాలు కచ్చితంగా విజయవంతమవుతుంటాయి. అలాంటి జంటల్లో అనుష్క, గోపీచంద్‌ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, శౌర్యం చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అనుష్క, గోపీచంద్‌ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పటికే రెండుసార్లు వెండి తెరపై మెస్మరైజ్‌ చేసిన ఈ జంట ఇప్పుడు మరోసారి మ్యాజిక్‌ చేయనుందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ‘అలిమేలు మంగ వెంకటరమణ’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే దర్శకుడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు, యాక్షన్‌ అంశాల కలబోతగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో తొలుత.. కీర్తిసురేష్‌, కాజల్‌ అగర్వాల్‌లో ఒకరిని తీసుకోవాలని భావించారట. కానీ వారి డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో చిత్రబృందం అనుష్క వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ జంట ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here