‘ఫైటర్‌’ కోసం మరో బాలీవుడ్‌ హీరో..

ప్రస్తుతం తెలుగు సినిమా పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి ఏంటో బాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీకి తెలుసొచ్చింది. ఇక ప్రస్తుతం బడా హీరోలంతా పాన్ ఇండియా మూవీలకే సై కొడుతున్నారు. దీంతో బాలీవుడ్‌ దిగ్గజ నిర్మాతలు కూడా మన హీరోలు, దర్శకులపై కన్నేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ దాదాపు పాన్‌ ఇండియా హీరోగా మారాడు. ఏకంగా బాలీవుడ్‌ దర్శకుడే ‘ఆది పురుష్‌’ చిత్రంతో ప్రబాస్‌ను డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘ఈస్మార్ట్‌ శంకర్‌’తో సంచలన విజయం అందుకున్న పూరీజగన్నాథ్‌ ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో ఫైటర్‌ సినిమాను పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ముంబయిలో మెజారిటీ భాగం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇలా పూరి ‘ఫైటర్‌’ను పక్కా పాన్‌ ఇండియా చిత్రంగా మార్చే క్రమంలో మరో అడుగు ముందుకు వేశాడు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టిని దించనున్నాడు. దీనికి సునీల్‌ ఇప్పటికే అంగీకారం కూడా తెలిపాడని సమాచారం. డాన్‌గా కనిపించే సునీల్‌ పాత్ర ఈ సినిమాకు కీలకంగా ఉంటుందని సమాచారం. మరి ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here