ఈ సమయంలో అక్కడ లేకపోవడం బాధగా ఉంది..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం చిగురుటాకుల వణికిపోతోంది. కాలనీలన్నీ నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై చెరువులను తలపిస్తూ నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికీ చాలా మంది నీళ్లలోనే చిక్కుకు పోయారు. మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌ అంతా అతలాకుతలమైంది. ఈ భారీ వర్షాల కారణంగా ఎంతో మంది గూడు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఇటు రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు స్పందిస్తున్నారు.

తాజాగా ఈ విషయమై టాలీవుడ్ సెన్సేషన్‌ హీరో విజయ్‌ దేవరకొండ స్పందించాడు. ప్రస్తుతం యూరప్‌లో ఉన్న విజయ్‌ ట్విట్టర్‌ వేదికగా హైదరాబాద్‌ వరదల గురించి ట్వీట్‌ చేశాడు. ‘లవ్‌ హైదరాబాద్‌ అంటూ.. ఈ సమయంలో హైదరాబాద్‌కు దూరంగా ఉండడం చాలా బాధగా ఉంది. కానీ మీ అందరి గురించే ఆలోచిస్తున్నాను, ఆపదలో ఉన్న వారికోసం ప్రార్థిస్తున్నాను. త్వరలోనే ఇంటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ నా ప్రేమను అందిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశాడు విజయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here