నాగార్జున సినిమాల విష‌యంలో నిజ‌మెంత‌…..

కింగ్ నాగార్జున సినిమాలంటే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌ను ఆక‌ట్టుకుంటూ నాగార్జున సినిమాలు ఉంటాయి. ఇటు వెండితెర‌తో పాటు బుల్లితెర అభిమానులు కూడా నాగార్జున‌కు ఉన్నారు.

తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం వైల్డ్ డాగ్ విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారిగా నటించారు. `వైల్డ్ డాగ్` తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొదించబోయే సినిమాలో నాగ్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే బాలీవుడ్‌లో విజయవంతమైన రైడ్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని కూడా నాగార్జున భావిస్తున్నారట. ఓ యంగ్ డైరెక్టర్‌కు ఈ రీమేక్ బాధ్యతలను అప్పగించనున్నారట. అలాగే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు`ను కూడా నాగ్ పట్టాలెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిల్లో ఏ సినిమా ముందుగా ప్రారంభమవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతి తర్వాతే నాగార్జున తర్వాతి సినిమా విషయంలో స్పష్టత రాబోతోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here