పాయల్ చిరిగిన ప్యాంటును చూశారా.?

ఫ్యాషన్‌ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కాలానికి, మనుషుల అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషన్‌ మార్పు చెందుతూనే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మారుతోన్న ఫ్యాషన్‌ను చూస్తుంటే కాస్త ఆసక్తితో పాటు ఫన్నీగా కూడా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఇటీవల యువత చిరిగిన ప్యాంటు, షర్టులను ధరిస్తుండడం సర్వసాధరణంగా మారిపోయింది. ఇప్పుడు ఇదో లేటెస్ట్‌ ట్రెండ్‌.

View this post on Instagram

💫

A post shared by Payal Rajput (@rajputpaayal) on

ఈ క్రమంలోనే తాజాగా నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ధరించిన ఓ ప్యాంటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రెండు చోట్ల బొక్కలు పడినట్లున్న ప్యాంటును ధరించిన ఈ ముద్దుగుమ్మ ఒయ్యారంగా ఫొటోకు పోజిచ్చింది. అంతేనా.. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఫొటో చూసిన ఆమె అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న నటి పాయల్‌ తాజాగా తిరిగి సినిమా చిత్రీకరణలో పాల్గొన్న విషయం తెలిసిందే. బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాతో తెలుగు యువతకు తన అందంతో నిద్ర లేకుండా చేసింది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఒక్కో సినిమాతో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here