ఐఏఎస్ ఆఫీసర్‌గా మెగా హీరో..!

‘చిత్రలహరి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాతోనూ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు తేజ్‌. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయడానికి.. కొన్ని ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘ప్రస్థానం’ ఫేమ్ దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం తేజ్ ఇప్పటికే తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారట. ఇక ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే గతంలో నివేథ పేతురాజ్ పేరును కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి నివేథ స్థానాన్ని ఐశ్వర్య భర్తీ చేయనుందా.? లేదా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారా.? తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here