అందాల భామను వదలని కరోనా.!

కరోనా మహమ్మారి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వరినీ వదట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ పేరుతో ఇంటికే పరిమితమైన ప్రజలు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తుండడంతో వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార తమన్నా వైరస్ బారిన పడింది. గతకొన్ని రోజుల క్రితం తమన్నా కుటుంబసభ్యులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తమన్నా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా తెలింది.

ఇదిలా ఉంటే తాజాగా సినిమా చిత్రీకరణ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన తమన్నా భాటియా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సూచనమేరకు కరోనా పరీక్ష నిర్వహించడంతో తమన్నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తమన్నా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here