రాత్రి పూట బీప్ సౌండ్లు.. క‌రోనా రోగుల్లో కొత్త టెన్ష‌న్..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ విచిత్ర‌మైన రోగాలు తెచ్చిపెడుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా ఏదో విధంగా సోకుతూనే ఉంది. అయితే క‌రోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన‌వారు ఇప్పుడు కొత్త స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.

క‌రోనా నుంచి కోలుకున్న రోగులకు రాత్రి స‌మ‌యాల్లో కొత్త త‌ర‌హా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. విచిత్ర‌మైన శ‌బ్దాల‌తో వారికి మ‌న‌శ్శాంతి లేకుండా పోతోంది. యూపీలోని లక్నోలోని ఇందిరానగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు క‌రోనా సోకి డిశ్చార్జ్ అయ్యింది. ఆమెకు క‌రోనా సోకి కూడా రెండు నెల‌లు అయ్యింది. అయితే ఆమెకు రాత్రి వేళల్లో భయంకరమైన కలలు రావడంతోపాటు వెంటిలేటర్ బీప్ సౌండ్ వినిపిస్తోంద‌ట‌. కరోనా సోకిన స‌మ‌యంలో ఆమె ఐసీయూలో చికిత్స తీసుకుంది. దీని కార‌ణంగా ఇప్ప‌టికీ త‌న‌కు ఐసీయూలోనే ఉన్న‌ట్లు రాత్రి స‌మ‌యాల్లో అనిపిస్తూ ఉంటుంద‌ని తెలిపింది.

విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌గా వారు వెంట‌నే ఈమెను సైకాల‌జిస్టు ద‌గ్గ‌ర చూపించారు. ఈ వైద్యుడితో చికిత్స తీసుకున్న త‌ర్వాత ప్ర‌స్తుతం ఆమె మామూలుగానే ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఇది ఈమె ఒక్క‌దానిలోనే కాదు యువ‌కుల్లో కూడా కరోనా సోకిన అనంత‌రం ప‌లు ర‌కాల ఇబ్బందులు వ‌స్తున్నాయంట‌. రాత్రి వేళ‌ల్లో ఎక్కువ‌గా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, ఆందోళ‌గా ఉండ‌టం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. వీరంతా మ‌ళ్లీ సైకాల‌జిస్టుల వ‌ద్ద‌కు ప‌రుగులు తీస్తున్నారు. క‌రోనా నుంచి ఎలాగోలా కోలుకున్నామ‌ని సంబ‌ర ప‌డుతున్న వీళ్లు మళ్లీ డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లే ప‌రిస్థితులు రావ‌డం చాలా ఇబ్బందిగా ఉంటుంద‌ని ప‌బ్లిక్ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here