అంద‌రి చూపు చంద్ర‌బాబు అక్ర‌మ ఆస్తుల‌ కేసు వైపే..

తాను నిప్పు లాంటి వాడిన‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. కొన్నేళ్ల నుంచి త‌న‌పైన కేసులు వేసిన అన్నింటిలో తాను నిర్దోషిలాగే బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న అంటుండ‌టం మ‌నం వింటుంటాం. కానీ ఇప్పుడు ఆయ‌న అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ జ‌రుగుతోంది. దీంతో అంద‌రి చూపు చంద్ర‌న్న అక్ర‌మాస్తుల కేసు వైపే ఉంది.

ఏపీలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడైన చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా అంద‌రికి మ‌న‌కు తెలిసిన వారే. అయితే ఆయ‌న సీఎం అవ్వ‌క‌ముందు నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ఆస్తులు ఏవిధంగా ఉన్నాయో అన్నది చ‌ర్చనీయాంశంగా ఉంది. 1987నుంచి 2005వ సంవ‌త్స‌రం వ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు త‌న ఆస్తుల‌ను అక్ర‌మంగా పెంచుకున్నార‌ని ఆరోపిస్తూ ల‌క్ష్మీపార్వ‌తి కోర్టులో కేసు వేశారు. చంద్రబాబు అప్ప‌ట్లో ఈ కేసులో స్టే తెచ్చుకున్నా.. ఇప్పుడు మళ్లీ విచార‌ణ ప్రారంభం అయ్యింది.

ప్ర‌జాప్ర‌తినిధుల కేసుల ద‌ర్యాప్తులో భాగంగా ఈ కేసు ఇప్పుడు మళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో ల‌క్ష్మీపార్వ‌తి మాట్లాడుతూ చంద్ర‌బాబు జైలుకు వెళ్లే వ‌ర‌కు తాను వ‌దిలేది లేద‌ని అన‌డం చ‌ర్చనీయాంశం. చంద్ర‌బాబు ఆస్తుల‌కు సంబంధించిన వివరాలు ఆమె కోర్టుకు స‌మ‌ర్పించారు. ఈ పిటిష‌న్‌పై హైద‌రాబాద్‌లోని ఏసీబీ కోర్టులో విచార‌ణ జ‌రిగి.. ఈనెల 21కి విచార‌ణ మళ్లీ వాయిదా ప‌డింది. ఇక నుంచి చంద్ర‌బాబు కేసులో విచార‌ణ ముమ్మ‌రం అవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో చంద్ర‌న్న అక్ర‌మాస్తుల కేసు పైనే ఏపీ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబు అక్ర‌మాస్తుల కేసులో ఏం జ‌రుగుతుందోన‌ని ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here