అందుకే ర‌వితేజ ఆ సినిమా చేయ‌డం లేదా..

మాస్ మ‌హారాజ ర‌వితేజ సినిమా విష‌యంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయ‌న తీయాల‌నుకున్న ఓ సినిమా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో తేడా కొట్టింద‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. అందుకే ర‌వితేజ ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని అనుకుంటున్నారు.

ర‌వితేజ తాజాగా న‌టించిన క్రాక్ సినిమా త్వ‌ర‌లో సంక్రాంతికి రిలీజ్ అవ్వ‌నుంది. గతేడాది `ప్రతిరోజూ పండగే` సినిమాతో ఘనవిజయం అందుకున్నాడు దర్శకుడు మారుతి. దాని తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేయాలనుకున్నాడు. రవితేజకు కథ కూడా వినిపించాడు. ఆ కథ నచ్చడంతో రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఆగిపోయినట్టు తాజా సమాచారం. పారితోషికం విషయంలో తేడా రావడంతో ఆ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్‌లో గీతా-2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను ప్లాన్ చేశాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఈ సినిమా ముందుకెళ్లలేదట. వేరే హీరోతో ఈ సినిమా చేయడానికి రంగం సిద్ధమవుతోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here