రంగ‌స్థ‌లం సినిమా గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స‌మంత‌..

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రంగ‌స్థ‌లం సినిమాలో మెగాప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన స‌మంత తాజాగా ఆ సినిమా గురించి  ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. స‌మంత తాజాగా ఓటీటీ వేదిక‌గా సామ్ జామ్ అనే షో చేస్తున్న విష‌యం తెలిసిందే.

సమంత కెరీర్లోని మరపురాని చిత్రాలలో రంగ‌స్థ‌లం ఒక‌టని చెప్పొచ్చు. ఆమె మ్యారేజ్ చేసుకున్న త‌ర్వాత కూడా సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డానికి అందులోని న‌ట‌న ప్ర‌ధాన కార‌ణం అని చెబుతారు. రంగ‌స్థ‌లం సినిమాలో రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు స‌మంత‌ను సెల‌క్ట్ చేసిన‌ప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు త‌న‌ను అడ్డుకున్నార‌ని చెప్పారు. సమంత గ్లామరస్ హీరోయిన్ అని, పల్లెటూరి అమ్మాయిగా ఆమెను ప్రేక్షకులు ఒప్పుకొంటారో లేదో అని అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు సకుమార్‌కు చెప్పారట. అయితే సుకుమార్ స‌మంత‌పై న‌మ్మ‌కంతో ఉన్నార‌న్నారు. రామలక్ష్మి పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాన‌ని సమంత చెప్పారు. ఛాలెంజింగ్ గా తీసుకొని సినిమా చేసిన‌ట్లు చెప్పారు. ఆ త‌ర్వాత మంచి స్పంద‌న వ‌చ్చింద‌న్నారు సామ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here